Bihar | బిహార్‌లోని నలంద జిల్లాలో బోరు బావిలో పడిన బాలుడు శుభమ్‌ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. అనంతరం అధికారులు చికిత్స నిమిత్తం ఆ బాలుడిని నలందలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేదని, కొన్నిగంటల పాటు బోరుబావిలో ఉన్నందున సాధారణ చికిత్స అవసరమవుతుందని అన్నారు. శుభ్‌మన్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ఇవాళ ఉదయం ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడిన విషయం తెలిసిందే. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సాయంత్రం బాలుడిని సేఫ్‌గా భయటకు తీశారు.