Varla Ramaiah | పవన్ కల్యాణ్‌కు టీడీపీ కీలక నేత సపోర్ట్.. వైసీపీపై విమర్శలు

-

Varla Ramaiah – YS Jagan | జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ఓవైపు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మొదటి దశ వారాహి యాత్ర ముగియగా.. రెండో దశ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల్లో పవన్ కల్యాణ్ స్పీడు పెంచారు. ఘాటు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ లీడర్లు సైతం పవన్ కల్యాణ్‌కు ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో తరచూ పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ కూడా మూడు పెళ్లిళ్ల అంశాన్నే అస్త్రంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. దీంతో ఏపీ టీడీపీ కీలక నేత నేత వర్ల రామయ్య(Varla Ramaiah) సీఎం జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. జగన్ తాత రాజారెడ్డికి రెండు పెళ్లిళ్లు జరిగాయని సమాజం మాట్లాడుకుంటుందని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. పవన్ గురించి జగన్ చేస్తున్న కామెంట్స్ సభ్య సమాజంలోని మహిళలు తలలు దించుకునేలా ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ చట్టబద్ధంగా విడాకులిచ్చారని అన్నారు. పవన్‌పై జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.

Read Also: పవన్ కల్యాణ్‌కు ట్యూషన్‌ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా: మంత్రి బొత్స

Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...