ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను వ్యవసాయం నమ్ముకుని వచ్చిన వాడినని తెలిపారు… తాను ఇప్పుడు బెంజ్ కారులో తిరుగుతున్నానని అన్నారు….
ప్రభుత్వం తనపై ఎన్నిదాడులు చేసినా కూడా చిరవకు తాను మారుతీ కారులో అయినా తిరిగే శక్తి ఉందని అన్నారు.. అంతేకాదు సుమారు 100 మందికి అన్నం పెట్టే శక్తి తనవద్ద ఉందని అన్నారు… తాను జైలు కు అయినా పోతాను కానీ వైసీపీలోకి మాత్రం వెళ్లనని స్పష్టం చేశారు…
ఒక వేళ తాను జైలుకు వెళ్తే తన కుమారుడు తన మనవడు రానున్న రోజుల్లో గర్వంగా చెప్పుకుంటారని అన్నారు… తాను సిద్దంతాలను నమ్ముకున్న వాడినని అన్నారు… తనను పార్టీలో ఎవ్వరు చేరమని చెప్పలేదని కానీ తనపై జరుగుతున్న కక్ష వల్ల సీఎంను కలుస్తామని పిలుస్తున్నారని అన్నారు… తాను సీఎం కలిసినా కూడా ఆయన కుటుంబ విషాయాలను అడుగుతాను కానీ దివాకర్ బస్సుల సీజ్ లపై మాత్రం చస్తే అడగనని అన్నారు…