కమ్యూనిస్టులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వారి పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేరని, అందుకే ఆశా వర్కర్లను, అంగన్వాడీ సిబ్బందిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా.. హరీష్ రావు వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు.
‘‘ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా అల్లుళ్లకు అలవాటేనని మరోసారి రుజువు చేశారు హరీష్ గారూ. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచి ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేడని మాట్లాడుతున్నారు. ఈ ఊసరవెల్లుల గురించి కమ్యూనిష్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి, సమాజానికి అంత మంచిది.’’ అంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు నేతలు సీరియస్ అవుతున్నారు.