BRO Pre Release Event | పవన్ కల్యాణ్ ‘BRO’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు!

-

BRO Pre Release Event | పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తుండగా.. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. మాంచి హైప్ వచ్చింది.

- Advertisement -

దీంతో ఫ్యాన్స్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌(BRO Pre Release Event) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో స్వల్ప మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో రాజమండ్రిలో ఫంక్షన్ నిర్వహించాలనుకున్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. జులై 25న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ఈ ఫంక్షన్ జరుగనుంది. ఈ ఫంక్షన్‌కు పలువురు మెగా హీరోలు రానున్నట్లు సమాచారం.

Read Also: హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...