Siddipet | సిద్దిపేట జిల్లాకు అరుదైన గౌరవం.. అందులో చోటు!

-

జాతీయ స్వచ్ఛత క్రానికల్స్‌( Swachhata Chronicles)లో తెలంగాణలోని సిద్ధిపేట(Siddipet) జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛత క్రానికల్స్’ పేరిట ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా(Transformative Tales from India)’ కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో సంకలనాన్ని ఆవిష్కరించింది. ఈ స్వచ్ఛత క్రానికల్స్ లో మొత్తం 75 సక్సెస్ స్టోరీలు వచ్చాయి.

- Advertisement -

అజాదీ కా అమృత్ 75 వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా దేశంలోని వివిధ గ్రామాలు, జిల్లాలు, ప్రాంతాలలో విజయవంతంగా అమలవుతున్న స్వచ్ఛత, ప్లాస్టిక్, వ్యర్థాల నిర్వహణ ఇతరత్రా అంశాలను పొందుపరిచింది. వీటిలో సిద్ధిపేట(Siddipet) జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామపంచాయతీ, కేబీఆర్ ఫౌండేషన్ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే బదులుగా వెండి నాణేలు ఇవ్వడంతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య ప్రాణాలుగా మార్చుకోవచ్చునని ఆ విజయగాథలో పేర్కొంది.

Read Also: కమ్యూనిస్టులపై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్.. ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...