Hyderabad | ఉప్పల్‌లో ఉన్మాది ఘాతుకం.. గొంతు కోసి..

-

Hyderabad | ప్రేమ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇంట్లో పెద్దలను ఎదిరించడమే కాకుండా ఇంట్లో నుంచి పారిపోవడానికి కూడా వెనకడుగు వేయరు. మరికొందరైతే ప్రాణాలు తీసుకోవడానికి, ప్రాణాలు తీయడానికి కూడా భయపడరు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ప్రేమ అంగీకరించినందుకు ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం(Khammam) జిల్లాకు చెందిన ఉడుం లక్ష్మీనారాయణ(32) హబ్సిగూడలో నివాసం ఉంటున్నాడు. రామంతపూర్‌కు చెందిన యువతి (దగ్గరి బంధువు) వెంటబడుతూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇప్పటికే అతనికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సదరు యువతికి వరుసకు బావ.

రెండు రోజుల క్రితం మెట్రో రైలు దిగి స్టేషన్ కిందికి వచ్చిన ఆ యువతిని కారులో బయటకు తీసుకెళ్లాడు. ప్రేమ విషయంలో ఇద్దరి మద్య మాట మాట పెరగడంతో ఆగ్రహించిన ఉన్మాది కత్తితో ఆమె గొంతు కోసి పరారీ అయ్యాడు. అక్కడే పడిపోయిన ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: సిద్దిపేట జిల్లాకు అరుదైన గౌరవం.. అందులో చోటు!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...