INDIAN 2 | అంచనాలకు మించి ఉండనున్న కమల్ హాసన్‌ ఇండియన్-2!

-

సౌత్ ఇండియాలో కమల్ హాసన్‌(Kamal Haasan)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ఆ గెటప్ ఈ గెటప్ అనే తేడా లేకుండా అన్ని గెటప్స్‌లలో అభిమానులను అలరిస్తుంటాడు. అందుకే ఆయన్ను లోకనాయకుడిగా పిలుస్తుంటారు. ఇలాంటి విలక్షణ నటుడికి అద్భుతమైన దర్శకుడు తోడైతే ఇక ఆ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అదే నిజం కాబోతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌(Director Shankar)తో ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్ -2(INDIAN 2) సినిమా చేస్తున్నాడు. ఇది భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

- Advertisement -

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. చివరి భాగం పూర్తి చేసే పనిలో ఉన్నారు. కమల్ హాసన్ ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావడంతో అదే ఊపులో రెండేళ్ల క్రితం ఆగిపోయిన ‘ఇండియన్ 2’ సినిమాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. తాజాగా ఈ సినిమా కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇండియన్ 2(INDIAN 2) సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇండియన్-2లో సబ్ ఫ్లాట్ లు చాలా ఉన్నాయని ఇది మరో భాగంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. మరి ఇందులో నిజమెంతో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.

Read Also: పార్లే జీ బిస్కెట్ అంటేనే ఇష్టం.. మరోసారి నిరూపితం!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...