Varun Tej | మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్న వరుణ్ తేజ్!

-

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) రూటే సపరేటు. వినూత్న కథనాలతో ప్రతీసారి ప్రేక్షకులను అలరించాలనుకుంటాడు. తాజాగా.. మరో ఇంట్రెస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు.. ఈసారి పాన్ ఇండియాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. పలాస ఫేమ్ కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వంలో మట్కా అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా గురువారం(జులై 27) ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా విడుదల చేసిన మట్కా(MATKA) కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. 1958 నుండి 82 వరకు 24 సంవత్సరాల మధ్య జరిగిన మట్కా వైజాగ్ నేపథ్యంలో నడిచే పీరియాడిక్ డ్రామా. వాస్తవ సంఘటనల ఆధారంగా రోపొందిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్(Varun Tej) కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. కాగా, వరుణ్ తేజ్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా మట్కా ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు.

Read Also: అంచనాలకు మించి ఉండనున్న కమల్ హాసన్‌ ఇండియన్-2!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...