బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. సోమవారం మర్యాదపూర్వకంగా నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా నడ్డాను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై నడ్డా(JP Nadda)తో బండి చర్చించారు.
కాగా, ఏపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సునీల్ దియోథర్‌ను బీజేపీ అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో బండి సంజయ్‌కు బాధ్యతలు కేటాయిస్తుందని వార్తలు విస్తృతమయ్యాయి. ఈ క్రమంలో బండి సంజయ్(Bandi Sanjay) నడ్డాతో భేటీ కావడం, ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని ప్రకటించడం అందుకు ఆజ్యం పోస్తున్నది. నడ్డాతో భేటీ అనంతరం బండి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ(Modi)ని మూడోసారి ప్రధాని చేయడమే తన లక్ష్యమన్నారు. అందుకు తెలుగు రాష్ట్రాల్లో తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.