హైదరాబాద్(Hyderabad), భూపాల్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్ సమీపంలోని రాజేంద్ర నగర్లో హట్‌కు చెందిన సల్మాన్ అనే ఉగ్రవాదిని మంగళవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. సల్మాన్‌పై మే 24న కేసు నమోదు చేశారు. ఇవాళ అతనికి సంబంధించిన రెండు ఇళ్లలో సోదాలు చేయగా.. భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
Hyderabad | హార్డ్ డిస్క్‌లతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హట్ ద్వారా ఉగ్రవాద సంస్థలోకి సల్మాన్ యువతను రిక్రూట్ చేస్తున్నట్లు గుర్తించారు. షరియా చట్టం కోసం భారత్‌లో కుట్రలకు హట్ ప్లాన్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరైస్టైన వారి సంఖ్య 17కు చేరింది.