రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కేసీఆర్ రైతు బాంధవుడు అని, రైతుల పక్షపాతి అని, కష్టం తెలిసిన నాయకుడు అని ప్రశంసిస్తూ.. రుణమాఫీ ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలని రైతాంగానికి, బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తాజాగా.. మంత్రి కేటీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘2018 ఎన్నికల్లో హామీ ఇచ్చి, 2023 ఎన్నికల సమయంలో సోయికొచ్చిన కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నాం, సంబరాలు చేసుకోండి అనడం సిగ్గుచేటు అని కిరణ్ మండిపడ్డారు. లక్ష రూపాయలకు గత 5 సంవత్సరాల వడ్డీని ఎవరు కట్టాలి, దీని పై రైతులకు వివరణ ఇవ్వండి.’ అంటూ కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
మాఫీ ముచ్చట..
ఉత్సవాల పిలుపులు బానే ఉన్నాయి.
మరి ఈ ఐదేళ్లుగా రైతు రుణాలపై మిత్తికి మిత్తి పడి తడిసి మోపెడయ్యింది మరి అది ఎవరు కడతారు?
రుణమాఫీ గురించి నాలుగేళ్ల క్రితం కేసీఆర్ చెప్పింది ఒకటి.. చేస్తోంది మరొకటి..
కేటాయింపులు సక్రమంగా లేవు
నిధులు విడుదల సక్రమంగా చేసింది… pic.twitter.com/R63kYcPx4Z— Kiran Kumar Chamala (@kiran_chamala) August 3, 2023