టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ బాబు పుట్టినరోజు(9th August) సందర్భంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బిజినెస్‌మెన్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ అభిమానులు ముందస్తుగా బుక్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు.
ఏపీ, తెలంగాణల్లోని చాలా థియేటర్లలో టికెట్లు అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ముందే ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడయితే థియేటర్లలో రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళితో మరో సినిమా చేయబోతున్నారు. రాజమౌళి సినిమాపై అంచనాలు మరో స్థాయిలో పెట్టుకున్నారు అభిమానులు.