వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) స్పందించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమను పిచ్చుక కంటే తక్కువ చేసి మాట్లాడితే ఎలా అని అడిగారు. చిరంజీవి(Chiranjeevi) ముందు వాళ్ల తమ్ముడికి జ్ఞానబోధ చేయాలని.. తర్వాత రాజకీయ పార్టీలకు సూచనలు చేయాలని సూచించారు. సినిమాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చింది పవన్ కల్యాణే అని స్పష్టం చేశారు. బ్రో సినిమాలో మంత్రి రాంబాబు(Ambati Rambabu)ను విమర్శించేలా శ్యాంబాబు పాత్రను క్రియేట్ చేసి ఉండకపోతే అసలు ఈ గొడవే ఉండేది కాదని అన్నారు. శుభ్రం చేయాల్సింది రాజకీయాలనో, చిత్ర పరిశ్రమనో కాదని ముందు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను శుభ్రం చేయాలని అన్నారు.
Gudivada Amarnath | చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అమర్నాథ్
-