టీబీజేపీకి బిగ్‌ షాక్‌.. కమలం పార్టీకి కీలక నేత గుడ్‌ బై 

-

తెలంగాణ బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పేరున్న లీడర్లు పార్టీని వీడుతుండగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో తాను 12 ఏళ్లు పని చేశానని.. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిని సైతం వదులుకున్నానని లేఖలో పేర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చినా రైతుల పొలాలకు నీళ్లు రాలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదని తెలిపారు. ఇక తనలాంటి ఎంతో మంది ఉద్యమనాయకులు.. బీజేపీలో చేరి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

- Advertisement -

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న భావన తెలంగాణ ప్రజల్లో నాటుకుపోతుందన్నారు. కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను నిలువరించలేకపోతుందని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కిషన్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించిన దగ్గరి నుంచి చంద్రశేఖర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచే తీవ్ర నిరాశతో ఉన్న ఆయన పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, అధిష్టానంతో మంతనాలు కూడా జరిపారు. దీంతో ఈ నెల 18న ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఇక రానున్న ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ లేక చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 1985లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లోనే మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1989, 1994, 1999లలో వరుసగా టీడీపీ తరపునే బరిలోకి దిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున గెలిచి వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం 2008లో ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2021లో బీజేపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...