రష్యాకు భారీ షాక్.. జాబిల్లిపై కూలిపోయిన లూనా-25 ల్యాండర్

-

అగ్రరాజ్యాల్లో ఒక్కటైన రష్యా(Russia)కు జాబిల్లి మీద భారీ షాక్ తగిలింది. చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా-25(Luna-25 Lander) స్పేస్‌క్రాఫ్ట్‌ కుప్పకూలింది. ఈ మేరకు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా లూనా-25ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో లూనా -25 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆటోమెటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. తర్వాత లూనా-25 స్పేస్‌ క్రాఫ్ట్‌ అదుపుతప్పి చంద్రునిపై కుప్పకూలినట్లు తెలిపింది.

- Advertisement -

దాదాపు 50 ఏళ్లు విరామం తర్వాత రష్యా చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా-25ని ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే లూనా-25 చంద్రుడిపై ల్యాండ్ అయ్యేలా ఆ దేశ సైంటిస్టులు ప్లాన్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ చంద్రుడి దక్షిణ ధృవంలో సోమవారం సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్లలో నీరు ఉండొచ్చని రష్యన్ సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై పరిశోధించడంతో పాటు చంద్రునిపై విలువైన మూలకాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. శనివారమే చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన తొలి చిత్రాన్ని తీసి పంపించింది లూనా-25. చంద్రుడి అవతలి వైపు ఉండే ప్రాంతం భూమిపై నుంచి కనిపించదని.. ఆ ప్రాంతాన్నే లూనా-25 స్పేస్ క్రాఫ్ట్‌ ఫోటో తీసిందని రష్యన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

రష్యా చివరగా 1976లో తొలి లూనార్‌ ల్యాండర్‌(Luna-25 Lander)ను ప్రయోగించింది. ఈ మిషన్ లో చంద్రుడిపై ఉన్న 170గ్రాముల మట్టి శాంపిళ్లను భూమికి తీసుకురాగలిగింది రష్యా. ఇక భారత్ సైతం చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఇప్పటికే కీలక దశలు పూర్తి చేసుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగు పెట్టనుంది.

Read Also: ట్రాన్స్​జెండర్లుగా వేషం మార్చి భిక్షాటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...