బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్(Chennamaneni Ramesh) సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘నిన్ననే మా సంగీత పక్కాగా పట్టా తీసుకొని డాక్టరమ్మ అయ్యింది. సంగీత ఆరు సంవత్సరాలున్నప్పుడే నాన్నా నేను డాక్టర్నయిత అన్న మాటలు ఇప్పటికీ నాకు వినిపిస్తున్నాయి. మొదట తల్లిగా నా భార్యకు, మా కుటుంబ సభ్యులందరికీ అత్యంత సంతోషకరమయిన సందర్భాన్ని ఆప్తులయిన మీ అందరితో పంచుకుంటున్నాము.
ఇక రాజకీయాలు ప్రజలకోసమే చేయాలి.. పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని నాతో ఉన్నవారందరికీ భరోసా ఇస్తున్నాను. దయచేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి.. లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం.’’ అని చెన్నమనేని రమేశ్(Chennamaneni Ramesh) భావోద్వేగ పోస్ట్ పెట్టారు.