మళ్లీ లోకేష్ కు హ్యాండిచ్చిన చంద్రబాబు

మళ్లీ లోకేష్ కు హ్యాండిచ్చిన చంద్రబాబు)

0
89

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా కీలక రోల్ పోషిస్తున్నారు.. అయితే పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తీసుకురావాలి అని చూస్తున్నారు, అంతేకాదు ఆ పదవిని నారాలోకేష్ కు ఇవ్వాలి అని భావిస్తున్నారు. దీని కోసం టీడీపీ సీనియర్ నేతల దగ్గర చంద్రబాబు గతంలో డిస్కస్ చేశారు. అయితే చంద్రబాబు చెప్పిన మాటలకు కొందరు సీనియర్లు ఇది సరైన సమయం అని చెబుతుంటే, మరికొందరు మాత్రం అప్పుడే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు వద్దు అని చెప్పారట.

వైసీపీ లోకేష్ ని దారుణంగా టార్గెట్ చేస్తోంది. మరో పక్క బీజేపీ కూడా హస్తం ఇస్తోంది. ఈ సమయంలో మనం లోకేష్ ని పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెబితే ఆ తర్వాత రాజకీయంగా మన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజారితే ఆ మైనస్ అంతా చినబాబుమీద పడుతుంది అని, దానిని వైసీపీ తనకు అనుకూలంగా మలచుకుంటుంది అని చెబుతున్నారట. అందుకే తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్లు జూనియర్లు కూడా కొందరు అప్పుడే చినబాబుకి ఈ పదవి వద్దని వైసీపీకి ఓ సంవత్సరం పాలన సమయం అయ్యాక చూద్దాం అని చెప్పారట. దీంతో బాబు కూడా సమాలోచనలు చేస్తున్నారు.