నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: 69 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన తెలుగు సినిమా

-

భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’‌(National Film Awards)ను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్రకటించింది. ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జ్యూరీ కమిటీ ఈ అవార్డులను ప్రకటించింది. దాదాసాహెబ్ పాల్కే అవార్డ్‌‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఎక్కువగా అవార్డులు సొంతం చేసుకున్న సినిమాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నిలిచింది. పుష్ప సినిమాకు రెండు అవార్డులు లభించాయి. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్‌ నిలిచాడు. కాగా, 69 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలుగు సినిమా నుంచి జాతీయ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కావడం విశేషం.

- Advertisement -

National Film Awards:

జాతీయ ఉత్తమ నటి: అలియాభట్‌ (గంగూబాయి కథియవాడి), కృతి సనన్‌ (మిమి)

ఉత్తమ జాతీయ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-1)

ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: కశ్మీర్‌ ఫైల్స్‌( హింది)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ఆర్ఆర్ (తెలుగు)

ఉత్తమ చిత్రం: రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్ (హిందీ)

ఉత్తమ ఫిలిం క్రిటిక్స్: పురుషోత్తమాచార్యులు ( తెలుగు)

ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన, బుచ్చిబాబు

ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉద్దాం

ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ

ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ – కింగ్‌ సోలోమన్ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ – శ్రీనివాస్‌ మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్ (కొండపొలం ) (తెలుగు)

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప-1)

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ – ఎంఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయ గోషల్‌

ఉత్తమ నేపథ్య గాయకుడు: కాళభైరవ, `కొమురం భీముడో` (ఆర్ఆర్ఆర్)

Read Also: రాజమౌళి-మహేశ్ బాబు సినిమా.. ఆ వార్తలపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...