రాష్ట్రంలో మరో కొత్త మంత్రి.. ప్రమాణ స్వీకారం చేసిన పట్నం

-

రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్‌భవన్‌‌లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు హజరయ్యారు. కాగా, ఈటల రాజేందర్ బర్త్‌రఫ్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు సీఎం కేసీఆర్(KCR) ఆ మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు.

- Advertisement -

తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. దీనిపై మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) గతంలో రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు లీకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also: రాజమౌళి-మహేశ్ బాబు సినిమా.. ఆ వార్తలపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...