చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

-

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల అనుబంధం అని అందరూ భావిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి చాలా సంవత్సరాల పాటు టీడీపీలో పనిచేశారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా కానీ ఏనాడూ చంద్రబాబును రేవంత్ విమర్శించలేదు. దీంతో టీడీపీ మద్దతుదారులు రేవంత్‌ను విపరీతంగా అభిమానిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా టీడీపీ అభిమానులు సంతోషించారు.

- Advertisement -

అయితే తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు తనకు గురువు కాదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. ‘శిష్యుడి కోసం చంద్రబాబు గారు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపచేశారు… ఇప్పుడు గురువుగారు అక్కడ పోటీ చేస్తున్నారు. శిష్యుడి సహకారం ఏమైనా ఉంటుందా?’ అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీంతో ఆ ప్రశ్నపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఎవ‌డ‌య్యా బుర్రలేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవ‌రు..? గురువు ఎవ‌రు..? నేను స‌హ‌చరుడిని అని చెప్పినా.. ఎవ‌డ‌న్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు(Chandrababu) గారు పార్టీ అధ్యక్షుడు. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను స‌హ‌చ‌రుడిని’ అని సమాధానం చెప్పారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్, వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు.

Read Also: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...