టీడీపీ నేతలపై కేసులు నమోదుచేయడంపై లోకేష్ ఆగ్రహం 

-

టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “యువ‌గ‌ళం స‌భ‌లో నేను, మా టిడిపి నేత‌లు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశామ‌ని పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. నా త‌ల్లిని అవ‌మానించిన‌వాళ్లు, మ‌రో త‌ల్లిని అవ‌మానించకుండా బుద్ధి చెబుతాన‌న‌డం రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు ఎలా అవుతాయో! ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జాకంట‌క పాల‌కుల‌ని ప్ర‌శ్నించే బాధ్య‌తని ప్ర‌తిప‌క్ష‌ టీడీపీ నిర్వ‌ర్తించ‌డం నేరం ఎలా అవుతుందో అని అడిగారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు అంటే నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న జ‌గ‌న్ రెడ్డి చేసిన‌వని చెప్పుకొచ్చారు. అపోజిష‌న్ లీడ‌ర్‌లా కాకుండా ఫ్యాక్ష‌నిస్టులా చంద్ర‌బాబుని కాల్చి చంపండి, ఉరి వేయండి, చెప్పుల‌తో కొట్టండి, చీపుర్ల‌తో త‌ర‌మండి అని విద్వేషం నింపే ప్ర‌సంగాలు చేశారు” అని ట్వీట్ చేశారు.

- Advertisement -

పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో టీడీపీ నేతలు చేసిన ప్రసంగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలతో పాటు ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ విమర్శలు చేశారని కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు కాగా.. బుద్దా వెంకన్నపై 153, 153a, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సభా వేదిక నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని ఫిర్యాదు చేశారు.

మరోవైపు నూజివీడులో జరుగుతున్న పాదయాత్రలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో పాదయాత్ర సందర్భంగా సైకో పోవాలి సైకిల్ రావాలి పాటను ఆపాలని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...