ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

-

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నారని ఖర్గే విమర్శించారు. ప్రజల మనసు తెలిసుకున్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక సోనియాతో ఫోటో దిగిన కేసీఆర్.. బయటకు వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గేకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాదర స్వాగతం పలికారు.

- Advertisement -

SC and ST Declaration

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంచుతామన్నారు. ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తామని తెలిపారు. అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. దళిత, గిరిజనుల విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రత్యేక పథకాలు తీసుకువస్తామన్నారు. సమ్మక్క-సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయితీకి రూ. 25 లక్షల నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.

SC and ST Declaration

మూడు ఎస్సీ కార్పొరేషన్లు.. మాదిగ, మాల మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు ఏర్పాటు చేసి.. ఇందుకోసం ప్రతి ఏడాది రూ.750 కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు. మూడు ఎస్టీ కార్పొరేషన్లు.. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ప్రతి ఏడాది రూ.500 కోట్ల నిధులు ఇస్తామని తెలిపారు. విద్యా జ్యోతులు పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10,000, ఇంటర్ పాసైతే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. లక్ష అందజేత, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...