ఏపీలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో రాష్ట్ర ఎన్నికల అధికారులు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారని తెలిపారు. వైసీపీ చేసిన దారుణాలను సాక్ష్యాధారాలతో ఈసీ(EC)కి సమర్పించామన్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా 2024 ఎన్నికలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే 60 లక్షలకు పైగా ఓట్లను వైసీపీ నేతలు తొలగించారన్నారు. వాలంటీర్లతో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ వచ్చానని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా వివరించారు. అవసరమైతే హైపవర్ కమిటీని, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలని సూచించామని బాబు(Chandrababu) వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు ఫిర్యాదుకు పోటీగా విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) నేతృతంలోని వైసీపీ ఎంపీల బృందం కూడా సీఈసీని కలిసి ఫిర్యాదుచేశారు.