MP రంజిత్‌ రెడ్డి భార్యకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

-

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి నూతన సభ్యురాలిగా నామినేట్ అయిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్‌ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను సీతారంజిత్ రెడ్డి(Sita Ranjith Reddy), భర్త ఎంపీ రంజిత్‌రెడ్డి, కుమారుడు రాజ్ ఆర్యన్‌ రెడ్డితో పాటు మార్యాదపూర్వకంగా కలిశారు. తనకు టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపి ఆయన ఆశ్వీరాదం తీసుకున్నారు.

- Advertisement -

టీటీడీ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్‌ రెడ్డి(Bhumana Karunakar Reddy) కొత్త పాలకమండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలకమండలిలో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలకు చోటు కల్పించారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి భార్య సీతారంజిత్‌ రెడ్డి(Sita Ranjith Reddy) ఎంపికయ్యారు. మండలిలో చోటు దక్కడంపై రంజిత్ రెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు ప్రగాఢంగా నమ్మే శ్రీవారికి చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...