ఆర్-5 జోన్‌ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

-

అమరావతి ఆర్‌-5 జోన్( R-5 Zone Issue) అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది. రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని గతంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

- Advertisement -

 R-5 Zone Issue | ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించండంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇతర చోట్ల స్థలాలు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు కట్టించకుండా.. కేవలం రాజధాని ప్రాంతంలోనే ఎందుకు ఇళ్లు కట్టించడానికి మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇళ్ల నిర్మాణాలు ఆపాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా తమక మద్దతుగా తీర్పు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: సౌత్‌లో రజినీకాంత్ సెన్సేషనల్ రికార్డ్.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో పారితోషికం!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...

AP Cabinet: కూటమి ప్రభుత్వంలో కొత్త ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి...