దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని విజయవాడ ఎంపీ కేశినేనా నాని(Kesineni Nani) కొనియాడారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై స్పందిస్తూ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయన వివరణ ఇస్తారని తెలిపారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మరక లేని వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. టీడీపీ నుంచి మూడో సారి కూడా గెలిచి పార్లమెంట్‌కు వెళ్తానని కేశినేని ధీమా వ్యక్తం చేశారు.
కొంతకాలంగా కేశినేని నాని(Kesineni Nani) వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. విజయవాడలో జరిగిన లోకేష్(Nara Lokesh) పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనకపోవడం.. పాదయాత్ర బాధ్యతలను ఆయన సోదరుడు కేశినేని చిన్నికి పార్టీ అప్పగించింది. దీంతో నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా కేశినేని మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.