తెలంగాణ పర్యటనకు వచ్చిన పీఎం నరేంద్ర మోడీ(PM Modi) మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్, వరంగల్ – ఖమ్మం విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్ నగర్ బీజేపీ ప్రజాగర్జన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని… తెలంగాణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సభా వేదికపై ప్రధాని కీలక ప్రకటనలు చేశారు. ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పసుపు రైతుల కల సాకారం చేశారు. తెలంగాణలో నేషనల్ టర్మరిక్ బోర్డు (పసుపు బోర్డు)ను ఏర్పాటు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ములుగులో రూ. 900 కోట్ల వ్యయంతో సమ్మక్క సారక్క పేరిట కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చెత్తను ఎత్తి శ్రమదానం చేసిన మోడీ:
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ(PM Modi) మాట్లాడుతూ. ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఒక గంట శ్రమదానం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ అంకిత్ బయాన్ పురియాతో కలిసి శ్రమదానం చేశారు. స్వయంగా ఆయన చీపురు పట్టుకుని ఊడ్చి, చెత్తను గంపల్లోకి ఎత్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోడీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు చేశారు. దేశమంతా స్వచ్ఛతపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో అంకిత్ బైయాన్ పురియా, తాను కలిసి ఇదే కార్యక్రమం చేపట్టామన్నారు. పరిశుభ్రతకే పరిమితం కాకుండా, ఫిట్ నెస్, ఆరోగ్యాన్ని కూడా దీనిలో మిళితం చేశామన్నారు. ఈ కార్యక్రమం పరిశుభ్రత, ఆరోగ్య భారత్ సందేశాన్ని అందజేస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @baiyanpuria pic.twitter.com/gwn1SgdR2C
— Narendra Modi (@narendramodi) October 1, 2023