వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి విజయం సాధించింది. అయితే 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొంది ఏపీలో చరిత్ర కొత్తగా లిఖించారు అనే చెప్పాలి.. వైయస్ జగన్ పై నమ్మకం అలాగే నవరత్నాల అమలు కోసం ప్రజలు అందరూ వైయస్ జగన్ కు ఈ అవకాశం ఇచ్చారు. అయితే డిసెంబరుతో జగన్ కు ఆరునెలల పదవికాలం పూర్తి అవుతుంది. అందుకే వైయస్ జగన్ ప్రజల్లో తన పరిపాలన గురించి తెలుసుకోనున్నారట.
అంతేకాదు ప్రైవేట్ సర్వే ప్రకారం ఏ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది.. ఎవరు నియోజకవర్గ సమస్యలు పట్టించుకుంటున్నారు.. ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోనున్నారట. కేవలం 10 రోజుల్లో ఈ సర్వే పని పూర్తి చేయనుంది. 151 నియోజకవర్గాలతో పాటు 24 సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్దులు ఇంచార్జ్ లు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోనున్నారు, దీని తర్వాత వారి రిపోర్టు ప్రకారం ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోనున్నారట జగన్.