Janta ka Mood Survey | తెలంగాణలో ఎటూ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఇంకో నెల రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామంటే తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సర్వేలు ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ‘జనతా కా మూడ్’ బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వస్తుందని తెలిపింది. సీఎంగా కేసీఆర్(KCR) హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తెలిపింది. ఈ సర్వే ఫలితాలతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
ఈ సర్వే(Janta ka Mood Survey) ప్రకారం బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 36 వరకు.. బీజేపీ 9 నుంచి 7 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఎంఐఎంకు 4 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్పింది. ఓట్ల శాతం విషయానికి వస్తే అధికార బీఆర్ఎస్‌కు 41 శాతం, కాంగ్రెస్‌కు 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 20 వేల శాంపిళ్లను తీసుకుని సర్వే చేసినట్టు ప్రకటించింది.