2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీ తరపున పోటీ చేసి మొదటి సారి ఎమ్మెల్యే అయింది వంగలపూడి అనిత… గతంలో అధికార పార్టీలో ఉన్న అనిత ప్రతిపక్షంలో ఉన్న రోజాతో ఢీ అంటే ఢీ అని అటు అసెంబ్లీలోను ఇటు బయట తన దూకుడును ప్రదర్శించింది…
అలాంటి అనిత ఈ సారి జగన్ సునామిలో కొట్టుకుపోయింది… 2019 ఎన్నికల్లో పాయకరాపుపేట కాకుండ చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరూకు షిఫ్ట్ చేశారు.. ఇక్కడ ప్రాతినిత్యం వహించిన జవహర్ ను కృష్ణా జిల్లాకు షిఫ్ట చేశారు…
కానీ వీరిద్దరు ఓటమి చెందారు.. ఓటమి చెందిన తర్వాత అనిత తాను కొవ్వూరులో ఓడినా కూడా ఇక్కడే ఉంటానని అన్నారు… కానీ ఓవరాల్ గా చూస్తే నియోజకర్గంలో పర్యటించింది ఒక్కసారి మాత్రమే. దీంతో ఆమె తనకు అనుకూలంగా ఉన్న పాయకరావుపేటకు మాకం వేసినట్లు తెలుస్తోంది… ఇటీవలే చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో ఉన్నప్పుడు వంగల పూడి అనిత పాయకరావుపేట సమస్యల గురించి వివరించినట్లు వార్తలు వస్తున్నాయి…