సీఎం కేసీఆర్(CM KCR) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా టెక్నికల్ సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్‌ను తిరిగి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరో హెలికాఫ్టర్‌ను ఏవియేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆ హెలికాఫ్టర్ రాగానే యథావిధిగా తన పర్యటనను కొనసాగించనున్నారు. ప్రచారంలో భాగంగా దేవరకద్ర, గద్వాల్, నారాయణ్‌పేట, మక్తల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజాశీర్వాద యాత్రలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఇక రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు మొత్తం 16 రోజులు 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొంటారు.
సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య..
-