తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైంది.. అందరి నోట కాంగ్రెస్ మాటే అని సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు రెడీ అయ్యారని.. నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు కానీ ప్రజలను మేనేజ్ చేయలేరని వ్యాఖ్యానించారు.
దేశం కోసం త్యాగాలు చేసింది ఎవరు..? తెలంగాణ ఇచ్చింది ఎవరు..? దేశం కోసం రాజీవ్ గాంధీ శరీరం ముక్కలైతే.. రాహుల్ గాంధీ చిన్న వయసులో బాడీ ముక్కలు ఏరుకుని శ్మశానానికి వెళ్లారని బండ్ల ఎమోషన్ అయ్యారు. ఎవరు పడితే వారు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని విమర్శిస్తున్నారని.. కానీ రాహుల్ ఏనాడూ హద్దు దాటి మాట్లాడలేదని గుర్తుచేశారు. అహంకారం తలకెక్కిన వారందరికీ ప్రజలు దిమ్మతిరగే తీర్పు ఇవ్వనున్నారని వ్యాఖ్యానించారు. తన శ్వాస.. తన ధ్యాస.. కాంగ్రెస్ అని.. కాంగ్రెస్‌లోనే చస్తానన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది ముఖ్యం కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తనకు ముఖ్యమని బండ్ల గణేష్(Bandla Ganesh) వెల్లడించారు.