విన్ ప్రిడిక్షన్‌నా తొక్కా.. బ్రో అక్కడ ఉంది కోహ్లీ, మ్యాక్సీ..

-

World Cup | ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 201 పరుగులు కావాలి.. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.. ఆ సమయంలో విన్ ప్రిడిక్షన్‌లో అభిమానులందరూ ఆస్ట్రేలియాకు గెలుపు అవకాశాలు 5శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ సీన్ కట్ చేస్తే ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) పోరాటపటిమతో ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప ఇన్నింగ్స్‌గా చరిత్రలో మిగిలిపోతుంది. కాలి కండరాలు పట్టేసినా.. క్రీజులో సరిగా నిలబడలేకపోతున్నా.. ఒంటి కాలితోనే నొప్పి భరిస్తూ మ్యా్క్సీ ఆడిన ఆట నభూతో. బాల్ పడటమే ఆలస్యం సిక్సర్ల మీద సిక్సర్లు.. ఫోర్లు మీద ఫోర్లు కొడుతూ ఆఫ్ఘాన్ జట్టుకు దడ పుట్టించాడు. ఛేదనలో ఏకంగా డబుల్ సెంచరీ తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

- Advertisement -

సేమ్ ఇలాంటి పరిస్థితే గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఎదురైంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో విన్ ప్రిడిక్షన్ చూడగా.. పాకిస్తాన్ గెలుపు 85 పర్సెంట్‌గా చూపించింది. కానీ క్రీజు ఉంది కింగ్ కోహ్లీ.. అద్భుతంగా ఆడి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్‌ కూడా క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఆ మ్యాచులో కోహ్లీ కొట్టి స్ట్రైట్ డ్రైవ్ సిక్సర్‌ను శతాబ్ధపు షాట్‌గా ఐసీసీ పేర్కొంది.

World Cup

World Cup | ఇలా ఓడిపోయే మ్యాచులను గెలిపించిన విరాట్(Virat Kohli), మ్యాక్సీ ఇద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. దీంతో ఆర్సీబీ ప్లేయర్లు ప్రత్యర్ధుల ముందు సింహాల్లా నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఫ్యాన్స్ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: ఈసారి గొడ్డలితో వైలెన్స్ అంటున్న బాలయ్య.. NBK 109 షూటింగ్ మొదలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

CM Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి(CM Revanth...

Telangana Ministers | తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు..

Telangana Ministers | కొత్త ప్రభుత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...