Actor Chandra Mohan |ప్రముఖ సీనియర్ నటుడు చంద్ర మోహన్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1941వ సంవత్సరంలో కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.
Actor Chandra Mohan | 1966లో రంగుల రాట్నం చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయన నటించారు. రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. పదహేరళ్ల వయసు, సిరిసిరి ముద్వ చిత్రాల్లోని నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.