జనసేన పార్టీలో చేరిన ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్ సాగర్(Actor Sagar)కు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా సాగర్‌ను నియమించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సాగర్‌కు నియామక పత్రాన్ని పవన్ అందించారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ(Janasena-BJP) కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు పార్టీ తరపున పవన్ కల్యాణ్(Pawan Kalyan) బీఫారం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందని.. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందని వెల్లడించారు.
జనసేన ప్రచార కార్యదర్శిగా శ్రీ ములుకుంట్ల సాగర్ కు నియామక పత్రం అందజేత pic.twitter.com/djkgGNhOWZ
— JanaSena Party (@JanaSenaParty) November 9, 2023