బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

-

Actor Chandra Mohan |ప్రముఖ సీనియర్ నటుడు చంద్ర మోహన్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1941వ సంవత్సరంలో కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.

- Advertisement -

Actor Chandra Mohan | 1966లో రంగుల రాట్నం చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయన నటించారు. రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. పదహేరళ్ల వయసు, సిరిసిరి ముద్వ చిత్రాల్లోని నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also: ఈ పాలపొడి ప్యాక్ వేస్తే పిగ్మెంటేషన్ మచ్చలు మటుమాయం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Telangana Ministers | తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు..

Telangana Ministers | కొత్త ప్రభుత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Revanth Reddy | పాలకులం కాదు.. సేవకులం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృతజ్ఞత...