సచిన్ సెంచరీల రికార్డు బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ..

-

రన్ మెషీన్, కింగ్ ‘విరాట్ కోహ్లీ(Virat Kohli)’ సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డేల్లో అత్యధిక సెంచ‌రీలు(50) చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ స‌చిన్ టెండూల్కర్ సెంచరీల(49) రికార్డును బ్రేక్ చేశాడు. వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి ఈ అరుదైన ఘ‌న‌త‌ను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. స‌చిన్ 49 శ‌త‌కాలు చేయ‌డానికి 452 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. కోహ్లీ కేవ‌లం 279 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు అందుకోవ‌డం విశేషం.

- Advertisement -

వ‌న్డేల్లో అత్యధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

విరాట్ కోహ్లీ(Virat Kohli) (భార‌త్‌) – 50 శ‌త‌కాలు (279 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 49 శ‌త‌కాలు (452 ఇన్నింగ్స్‌లు)
రోహిత్ శర్మ(భార‌త్‌) – 31శ‌త‌కాలు (253 ఇన్నింగ్స్‌లు)
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 30 (365 ఇన్నింగ్స్‌లు)
సనత్ జయసూర్య (శ్రీలంక‌)- 28 శ‌త‌కాలు (433 ఇన్నింగ్స్‌లు)

వ‌న్డేల్లో అత్యధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలోకి దూసుకువ‌చ్చాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. పాంటింగ్ 375 వ‌న్డే మ్యాచుల్లో 365 ఇన్నింగ్స్‌ల్లో 13,704 ప‌రుగులు చేయ‌గా కోహ్లీ 290 వ‌న్డేల్లో 279 ఇన్నింగ్స్‌ల్లో 13,777 ప‌రుగులతో రికార్డును బ‌ద్దలు కొట్టాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్కర్ 463 వ‌న్డేల్లో 452 ఇన్నింగ్స్‌ల ద్వారా 18,426 ప‌రుగులతో అగ్ర స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర 14,234 ప‌రుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

Read Also: వరల్డ్ రికార్డు సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు...

కొత్త ఆధార్ కార్డుల కోసం కొత్త రూల్.. వారిని ఆపడానికే..

ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక...