చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్య.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈరోజు విచారణ సందర్భంగా సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలపై వైద్యులు ఇచ్చిన నివేదికన ఆయన తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు.

- Advertisement -

‘‘చంద్రబాబు(Chandrababu) కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించాం. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. ఐదు వారాల పాటు ఐ చెకప్‌ కోసం షెడ్యూల్‌ ఇచ్చాం. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదు వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి. మధుమేహం అదుపులో ఉంది.. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం’’ అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. ఈ నేపథ్యంలో మిగిలిన వాదనలు రేపు వింటామని విచారణను వాయిదా వేసింది.

Read Also: సచిన్ సెంచరీల రికార్డు బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...