Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు బంద్ కానున్నాయి. గత నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గరి నుంచి రాష్ట్రంలో ప్రచారం హోరెత్తింది. అగ్ర నేతలు సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార రథాలు పెట్టి ఊరూరా ఊదరగొట్టారు. ప్రచారం ముగియగానే ఇతర ప్రాంతాల నేతలందరూ వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది.
Telangana Elections | ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. మరోవైపు ప్రచారపర్వం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బుల పంపిణీకి నేతలు శ్రీకారం చుట్టారు. ఓటుకు రూ.2వేలు.. కొన్నిచోట్ల రూ.3వేలు కూడా పంచుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.