హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని స్థానిక ఎన్నికల అధికారిని ఆదేశించింది.
చివరి రోజు ప్రచారంలో భాగంగా భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు వేసి గెలిపిస్తే డిసెంబర్ 3న నియోజకవర్గానికి విజయయాత్రగా వస్తా… లేదంటే డిసెంబర్ 4న తన శవయాత్రకు ప్రజలు రావాలని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పుడు రెండే మార్గాలు ఎమ్మెల్యేగా గెలవడం లేదా తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమో అని ఎమెషన్ బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఈటలను ఎలాగైనా ఓడించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.