Telangana Ministers | అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మంత్రులకు శాఖల కేటాయిచారనే వార్తలు వచ్చాయి. కానీ అవి అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్.. ఏఐసీసీ పెద్దలతో మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. తాజాగా ఆ వివరాలను ప్రకటించారు.
ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే..
మల్లు భట్టి విక్రమార్క- ఆర్థిక శాఖ, ఇంధన శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి- పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ
దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంటకరెడ్డి- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
శ్రీధర్‌బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి- రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, పర్యాటకం శాఖ
పొన్నం ప్రభాకర్ -బీసీ సంక్షేమం, రవాణా శాఖ
కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
సీతక్క- పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ