Chandrababu | విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం: చంద్రబాబు

-

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పరోక్షంగా స్పందించారు. మిగ్‌జాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తుందని.. అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగినప్పుడు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అలా కాదని విర్రవీగితే ఏం జరుగుతుంతో తెలంగాణలో చూశామని.. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తామని తెలిపారు.

- Advertisement -

40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. అలాంటిది చేయని తప్పుకు ఎంతో క్షోభ అనుభవించానని వాపోయారు. తాను కూడా మనిషినేనని.. తనకు కూడా ఓ మనస్సు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు(Guntur) జిల్లా తెనాలి(Tenali), వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగుతోంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు(Chandrababu) దాదాపు మూడు నెలల అనంతరం పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Read Also: కేసీఆర్ హెల్త్‌ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...