TSRTC | మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. మహిళా మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్(VC Sajjanar) ఆదేశాలు జారీ చేశారు.
TSRTC ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు ఇవే..
బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మాత్రమే అవకాశం
అంతరాష్ట్ర సర్వీసుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే ఉచితం
తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం
గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి
ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు
కేవలం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే ఈ అవకాశం