తెలంగాణ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్(Pro Tem Speaker)గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కొత్త ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ఎంపికైన సంగతి తెలిసిందే.
Pro tem Speaker Akbaruddin Owaisi | నేటి నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు నాలుగురోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. చివరగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది.