ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన సీఎంను మాజీ మంత్రి కేటీఆర్(KTR) దగ్గరుండి కేసీఆర్ చికిత్స పొందుతున్న గదికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అసెంబ్లీకి రావాలని.. ఆయన సూచనలు, సలహాలు తమకు అవసరమని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
CM Revanth Reddy met KCR | కాగా గత గురువారం అర్థరాత్రి కేసీఆర్(KCR).. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కాలు జారి కింద పడ్డారు. హుటాహుటిన కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించి ఆయన తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. అనంతరం సర్జరీ చేసి హిప్ రిప్లేస్‌మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. కోలుకుంటున్నారని తెలిపారు.
#Telangana: Chief Minister @revanth_anumula met former Chief Minister KCR at the hospital.
Politics aside, Videos and pictures visibly display candid moments between @revanth_anumula and @KTRBRS. pic.twitter.com/LQ3xCKgzEf
— @Coreena Enet Suares (@CoreenaSuares2) December 10, 2023