శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) నేతృత్వంలోని మధ్యప్రదేశ్(Madhya Pradesh) ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్(Mohan Yadav) ని మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. కాగా, రాష్ట్రానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు జగదీష్ దేవదా, రాజేష్ శుక్లా ఉంటారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా కేంద్రమంత్రి నరేంద్ర తోమర్(Narendra Singh Tomar) బాధ్యతలు చేపట్టనున్నారు. యాదవ్ 2013లో ఉజ్జయిని దక్షిణ్ సెగ్మెంట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయన మరోసారి ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 2, 2020న, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా యాదవ్ ప్రమాణం చేశారు.
తాజాగా మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన బిజెపి కేంద్ర పరిశీలకులు మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ కె లక్ష్మణ్, ఆశా లక్రా బీజేపీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే యాదవ్ ని శాసనసభా పక్ష నేతగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అనంతరం అధిష్టానంతో చర్చించి ఈరోజు మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు.