తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అనంతరం ఆలయ ఈవో ధర్మారెడ్డి, భట్టి విక్రమార్కను శాలువాతో సత్కరించి, లడ్డూ ప్రసాదాలను అందించారు. కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల(Tirumala) వచ్చినట్టు భట్టి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కింద ఉంది చూడవచ్చు.
Bhatti Vikramarka | కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క
-