కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)ని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కన్వీనర్ షబ్బీర్ అలీ(Shabbir Ali), సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
పీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలు..
అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు
కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు
ఆరు గ్యారంటీల అమలుపై చర్చ
లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చ