ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ఉండవల్లికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్‌లోకి వెళ్లడం వైసీపీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ(Robin Sharma) రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన కూడా గతంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీంలో పనిచేశారు. తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీలో పీకేతో పాటు రాబిన్ కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేస్తారా.. సలహాలిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
In a very interesting development, political strategist Prashanth Kishore met with TDP supremo Chandrababu Naidu at his residence in Gannavaram. He landed at the airport with Nara Lokesh.
Prashanth Kishore worked as a strategist for Andhra’s current CM YS Jagan Mohan Reddy’s… pic.twitter.com/9OWSM9cxkK— Revathi (@revathitweets) December 23, 2023